RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

138920266

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 56 తో కలిపి చదువదగిన సెక్షన్ 20 లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించబడినందున మరియు ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి (KYC)’ నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన కొన్ని నిర్దిష్ట మార్గనిర్దేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణా చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా నవంబర్ 20, 2025 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ వారిపై రూ. 1.50 లక్ష (ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించడమైనది.

మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. చట్టబద్ధమైన నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన మరియు ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో బ్యాంకు వారి లోపాలను గుర్తించినందున ఇట్టి వైఫల్యానికిగాను బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన ద్రవ్య జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

ఈ బ్యాంకు:

  1. వారి డైరెక్టర్లకు రుణాలను మంజూరు చేసింది మరియు
  2. నిర్దిష్ట గడువులోపు ఖాతాదారుల KYC రికార్డులను కేంద్ర KYC రికార్డు రిజిస్ట్రీ (CKYCR) కి నవీకరించి సమర్పించడంలో విఫలమైంది.

ఇట్టి చర్య బ్యాంక్ యొక్క చట్టబద్ధమైన మరియు నియంత్రణ ఆదేశాలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటుకు గానీ లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. అంతేగాక ఇట్టి ద్రవ్య జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు.

( బ్రిజ్ రాజ్)      
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రిక ప్రకటన: 2025-2026/1557

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?