RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129248772

ది విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ ,ఆంధ్రప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు వారిచే ఆర్ధిక జరిమానా విధింపు

జాతీయ వ్యవసాయ మరియు  గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్)  వారిచే, “ఆర్ధిక మోసాలు – వర్గీకరణ,నివేదికల సమర్పణ,మరియు పర్యవేక్షణ’’  పై జారీ చేయబడిన ఆదేశాలను ఉల్లంఘించినందులకుగాను, ది విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్  ఆంధ్ర ప్రదేశ్ పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 15 జులై, 2024 ద్వారా రు.50,000/(అక్షరాల ఏభై వేల రూపాయలు మాత్రమే ) ఆర్ధిక జరిమానా విధించినది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i)   మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది

ఈ బ్యాంకు యొక్క 31-03-2023 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా నాబార్డ్ వారు  చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. ఆ తనిఖీ నివేదిక ఆధారంగా నాబార్డ్ ఆదేశాల ఉల్లంఘన మరియు తత్సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పరిగణన లోకి తీసుకుని, సదరు బ్యాంకు పై ఎందుకు ఆర్ధిక జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత విచారణ లో వాదన విన్నమీదట,నాబార్డ్ వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన (ఆర్ధిక మోసాల గురించి,నాబార్డ్ కి  నివేదికల సమర్పణలో జాప్యము  జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పరమైన జరిమానాను విధించవలసి వచ్చినది.

చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ముందు ముందు ఈ బ్యాంకు పై, భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకోదలచిన చర్యలకు ఈ ఆధిక జరిమానా అడ్డంకి కాదు   

       (పునీత్ పంచోలీ)

చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/727

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?