RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128923301

గుజరాత్‌లోని కఛ్‌లో గల గాంధీధామ్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్‌‌.బి.ఐ

గుజరాత్‌లోని కఛ్‌లో గల గాంధీధామ్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 ఆగస్టు 9న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1 లక్ష(కేవలం ఒక లక్ష రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లు, వారి బంధువులు హోదాలో ఉన్న లేదా ఆసక్తి ఉన్న ట్రస్టులకు మరియు సంస్థలకు విరాళాల’ పై ఆర్‌‌.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలను బ్యాంకు పాటించకపోవడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది.

2023 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ, ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, తాము పేర్కొన్న మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ గాంధీధామ్ మర్కంటైల్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌కు షోకాజు నోటీసు జారీ చేసింది.నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు, అదనపు వివరణలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంకు డైరెక్టర్లు/బంధువులు ఆసక్తి ఉన్న ట్రస్టుకు విరాళం ఇవ్వడాన్ని కొనసాగించినట్లు ఆర్.బి.ఐ గుర్తించింది. బ్యాంక్ ద్వారా ఆర్.బి.ఐ మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

(పునీత్ పాంచోలి)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/955

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?