గుజరాత్ రాష్ట్రం లోని గాంధీ నగర్ నగరానికి చెందిన "ది గాంధీనగర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. - ఆర్బిఐ - Reserve Bank of India
గుజరాత్ రాష్ట్రం లోని గాంధీ నగర్ నగరానికి చెందిన "ది గాంధీనగర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.
"డైరెక్టర్లు, బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు " మరియు దానికి అనుబంధమైన "డైరెక్టర్లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లు - డైరెక్టర్లే హామీదార్లు - స్పస్తీకరణ" కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని గాంధీ నగర్ నగరానికి చెందిన "ది గాంధీనగర్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 22-05-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పాటించనట్లు గుర్తించి ఈ విషయంలో సదరు బ్యాంక్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా సదరు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ లోని దిరెక్టర్లు వ్యక్తిగత పూచీకత్తుతో, తమ బంధువులకు అప్పులను మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం జరిగినట్లు నిర్ధారించి సదరు బ్యాంకుపై ఆపరాధ రుసుమును విధించింది. నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.
(పునీత్ పాంచోలి) ముఖ్య నిర్వహణ అధికారి పత్రికా విడుదల: 2024-2025/381 |