RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Press Releases Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108880080

ఘటాల్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

ఋణ సమాచార సంస్థల సభ్యత్వం (CICs)’, ‘ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు-UCBs’ మరియు ‘భారతీయ రిజర్వ్ బ్యాంక్ –(మీ ఖాతాదారును తెలుసుకోండి (KYC)) మార్గనిర్ధేశాలు, 2016’ కి సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను అనుసరించకపోవడం మరియు ‘డిపాజిటర్ శిక్షణ మరియు అవగాహన నిధి పథకం, 2014 –బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 సెక్షన్ 26A - కార్యాచరణ మార్గదర్శకాలు’ సంబందించి బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949 (BR Act) సెక్షన్ 26-A ఉల్లంఘనకు మరియు సెక్షన్ 25 (1) (iii) ఋణ సమాచార సంస్థల (నియంత్రణ) యాక్ట్, 2005లోని సెక్షన్ 23 (4)తో కలిపి రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 21, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఘటాల్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, పశ్చిమ బెంగాల్ (బ్యాంక్) వారి పై ₹1.5 లక్షలు (ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ పరిశీలనలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) CIC లకు ఋణ సమాచారాన్ని అందించడంలో విఫలమైంది, (ii) ఇంటర్-బ్యాంక్ కౌంటర్ పార్టీ ఎక్స్పోజర్ పరిమితి ఉల్లంఘన, (iii) ఖాతాల రిస్క్ వర్గీకరణ యొక్క క్రమానుగత సమీక్ష వ్యవస్థను ఏర్పాటు చేయలేదు, (iv) డిపాజిటర్ శిక్షణ మరియు అవగాహన నిధికి యోగ్యమైన మొత్తాలను బదిలీ చేయలేదు.

పై పరిశీలనల అనంతరం ఆర్బిఐ రూపొందించిన నిర్దేశాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

(యోగీష్ దయాళ్)
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1176

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?