RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

115420789

ది గుజరాత్ రాజ్య కర్మచారి కార్మికుల సహకార బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ , గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

పట్టణ సహకార బ్యాంకులు, ఆర్దిక నివేదికలు-బహిర్గత పరచవలసిన అంశాలు,పై మరియు   తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, పాటించవలసిన నిబంధనలపై భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులుడిపాజిట్లు వడ్డీ రేట్లు  , ” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని  సెక్షన్ 35 లో ఉప సెక్షన్ (2) లోని అధికరణములను ఉల్లంఘించినందులకు గాను ది గుజరాత్ రాజ్య కర్మచారి కార్మికుల  సహకార  బ్యాంకు లిమిటెడ్,అహమ్మదాబాద్ , గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేదీ 25 జూన్ 2024 ద్వారా రు .7 .50 లక్షల (అక్షరాల ఏడు లక్షల ఏభై వేల  రూపాయలు మాత్రమే) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 (1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ) మరియు సెక్షన్ 56 ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు జరిమానా ను విధించడమైనది.

బ్యాంకులో 31 మార్చ్ 2023 ఆర్ధిక పట్టికల ఆధారంగా భారతీయ  రిజర్వు బ్యాంకు చట్టబద్ధ తనిఖీ నిర్వహించారు. తనిఖీ లో బ్యాంకు, చట్టపరముగా పాటించవలసిన  విధి విధానాలను/భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలను పాటించలేదని గమనించి, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము ప్రకారము  పాటించనందులకు గాను బ్యాంకుపై జరిమానా ఎందుకు విధించకూడదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు ఇవ్వడమైనది. బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని బ్యాంకు పై ఆర్ధిక జరిమానాను విధించడమైనది.  రిజర్వు బ్యాంకు వారి  చట్ట బద్ధ తనిఖీ లో బహిర్గతమైన అంశాలు-(i) బ్యాంకు వార్షిక నివేదికలో  తమ బ్యాంకుపై భారతీయ రిజర్వు బ్యాంకు  విధించిన జరిమానా గురించి బ్యాలెన్స్ షీట్ లోనినోట్స్ టు అకౌంట్స్లో  ప్రస్తావించ లేదు. (ii) భారతీయ రిజర్వు బ్యాంకు తనిఖీ అధికారులు కోరిన విధముగా బ్యాంకు కు సంబంధించిన సమగ్ర సమాచారమును ఇతర  పత్రములను అందచేయలేదు.(iii)అంతర బ్యాంకుల స్థూల బహిర్గత మరియు కౌంటర్ పార్టీ పరిమితులను ఉల్లంఘించుట(iv)కాలపరిమితి ముగిసిన ఫిక్సడ్ డిపాజిట్లపై కాల పరిమితి ముగిసిన నాటినుండి చెల్లింపు తేదీ వరకు గల మధ్య కాలానికి  వర్తించే వడ్డీ రేటు ని చెల్లించలేదు.

చర్య భారతీయ రిజర్వు బ్యాంకు నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా అన్వయించుకోరాదు. మరియు, ఆర్ధిక జరిమానా విధించడం వలన ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పై భారతీయ రిజర్వు బ్యాంకు తీసుకునే ఇతర చర్య పై ప్రతికూల ప్రభావం చూపదు.

(పునీత్ పంచోళీ)     

చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024-2025/608

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?