<font face="mangal" size="3">గుజరాత్ రాజ్య కర్మచారి కో-ఆపరేటివ్ బ్యాంక్ ĸ - ఆర్బిఐ - Reserve Bank of India
గుజరాత్ రాజ్య కర్మచారి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 19/12/2022 గుజరాత్ రాజ్య కర్మచారి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్)పై గుజరాత్ రాజ్య కర్మచారి కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, అహ్మదాబాద్ (గుజరాత్), ‘చట్టబద్ధమైన నిల్వల నిర్వహణ - నగదు నిల్వల నిష్పత్తి (CRR) మరియు చట్టబద్ధమైన ద్రవ్య నిష్పత్తి (SLR)’ నిబంధనలపై ప్రాథమిక (అర్బన్) సహకార బ్యాంకులకు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జారీ చేసిన ఆదేశాలు మరియు 'ది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్ స్కీమ్', 2014 - సెక్షన్ 26A ఆఫ్ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 - మే 27, 2014 నాటి కార్యాచరణ మార్గదర్శకాలు’ సర్క్యులర్‌తో తో జతపర్చబడిన సెక్షన్ 26Aలోని సబ్-సెక్షన్ (2), 3వ పేరాగ్రాఫ్తో చదవబడిన బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (చట్టం)లోని ఆదేశాలను ఉల్లంఘించినందుకు - RBI తన డిసెంబర్ 15, 2022 నాటి ఉత్తర్వు ద్వారా బ్యాంకుపై రూ.3.00 లక్షలు (రూ. మూడు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా భావించరాదు. నేపధ్యము బ్యాంక్ యొక్క మార్చి 31, 2019 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని సంబంధిత ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలనలో, మిగతావాటితో కలిపి, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు అనుగుణంగా బ్యాంక్ కనీస నగదు నిల్వల నిష్పత్తి (CRR)ని నిర్వహించలేదని మరియు పది సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని కొన్ని ఖాతాలలోని బ్యాలెన్స్‌లను డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఫండ్‌కు జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంకు బదిలీ చేయలేదనీ వెల్లడైంది. దీని ఆధారంగా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1403 |