గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ‘మీ ఖాతాదారులను తెలుసుకోండి (KYC)’ పై జారీ చేయబడిన కొన్ని ఆదేశాలను పాటించనందుకు గుంటూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ (బ్యాంకు) వారిపై భారతీయ రిజర్వు బ్యాంకు సెప్టెంబర్ 23, 2025 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ. 50 వేల (యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం-1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ ఆధారంగా, ఆర్బీఐ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా, బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఈ అభియోగం సరియైనదిగా, విధించిన నగదు జరిమానా సహేతుకమైనదిగా ఆర్బీఐ ద్వారా నిర్ధారించడమైనది. ఈ బ్యాంకు నిర్దేశించిన కాలపరిమితిలోపు ఖాతాదారుల KYC రికార్డులను కేంద్ర KYC రికార్డుల రిజిస్ట్రీ (CKYCR)కి అప్‌లోడ్ చేయడంలో విఫలమైంది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవీల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. అంతేగాక ఇట్టి నగదు జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకుపై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు.(పునీత్ పంచోళీ) పత్రిక ప్రకటన: 2025-2026/1169 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: