RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109926155

ది హలోల్ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్, పంచమహల్ గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు

పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు  రుణాలు ఇచ్చేటప్పుడు, “తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలు-వివరణ,”మరియు పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు,  “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు,ఆదేశాలు - 2016” అనే అంశాల మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకున్నూ ది హలోల్ పట్టణ సహకార  బ్యాంకు లిమిటెడ్, పంచమహల్ గుజరాత్  పై భారతీయ రిజర్వు బ్యాంకు తమ ఉత్తర్వు తేది 14డిసెంబర్  ,2023 ద్వారా  ఆర్ధిక రు.2.00 లక్షలు ( అక్షరాల రెండు లక్షల రూపాయలు మాత్రమె ) ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధించింది బ్యాంకింగ్   రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)(  ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి  రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు.i)బ్యాంకు డైరెక్టర్ బంధువు హామీ పై ఋణము మంజూరు చేయుట ii)వివేచనతో నిర్ణయింపబడిన అంతర బ్యాంకుల కౌంటర్ పార్టీ బహిర్గత పరిమితిని ఉల్లంఘించుట iii) కాల పరిమితి ముగిసిన డిపాజిట్లకు, కాలపరిమితి ముగిసిన నాటినుండి డిపాజిట్ చెల్లించే నాటి వరకు అనుమతించబడే వడ్డీ రేటు ప్రకారము వడ్డీ చెల్లించక పోవుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు  ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. 

(యోగేష్ దయాళ్)
చీఫ్జనరల్ మేనేజర్

పత్రికా  ప్రకటన 2023-2024/1633

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?