ది హరిజ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్,హరిజ్ ,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది హరిజ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్,హరిజ్ ,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు
భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకులలో ఉంచవలసిన కనీస నగదు రిజర్వు నిష్పత్తిపై ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు ,పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు-2016” అనే అంశం మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు ది హరిజ్ నాగరిక్ సహకారి బ్యాంకు లిమిటెడ్,హరిజ్ ,గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక రు.3.00 లక్షలు ( అక్షరాల మూడు లక్షల రూపాయలు మాత్రమె )జరిమానా ( పెనాల్టీ ) విధించింది బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు(i) బ్యాంకులో ఉంచవలసిన నగదు రిజర్వు నిష్పత్తి ని కొన్ని రోజుల పాటు నిర్వహించకపోవుట (ii) అంతర బ్యాంకుల మధ్య కౌంటర్ పార్టి బహిర్గత పరిమితిని ఉల్లంఘించుట (iii) చనిపోయిన, వ్యక్తుల కరెంటు ఖాతాల వారికి/ ఒకరే యజమాని వున్నదుకాణాదారుల/సంస్థల కరెంటు ఖాతాల వారికి అనువర్తించే వడ్డీ రేటు ప్రకారం వడ్డీ చెల్లించక పోవుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన 2023-2024/942 |