RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

115419036

హిందుస్తాన్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’, ‘ఏక మరియు బృంద రుణగ్రహీతలు/పార్టీలు మరియు పెద్ద ఎక్స్‌పోజర్‌ల పరిమితులు’ అలాగే ‘మీ ఖాతాదారుని తెలుసుకోండి (KYC)’ నిబంధనలకు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన నిర్దిష్ట మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన.

అధికారం ఆధారంగా జులై 24, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా హిందుస్తాన్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ముంబై, వారి పై రూ. ₹4 లక్షలు (నాలుగు లక్షల రూపాయలు) ద్రవ్య జరిమానా విధించడమైనది.మార్చి 31, 2023 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ ఆధారంగ, ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యనికిగాను బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, దిగువ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో బ్యాంకు వైఫల్యం చెందిందన్న అభియోగం నిజమని నిర్ధారణ అయినందున బ్యాంకు పై ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.ఈ బ్యాంకు (i) నామమాత్రపు సభ్యులకు నిర్దేశిత నియంత్రణ పరిమితికి మించి రుణాలు మంజూరు చేసింది (ii) ఏక రుణగ్రహీత ఎక్స్పోజర్ పరిమితిని పాటించడంలో విఫలమైంది, (iii) బ్యాంకు వినియోగదారులకు బహుళ ప్రత్యేక వినియోగదారు గుర్తింపు (యునీక్ కస్టమర్ ఐడెంటిఫికేషన్) కోడ్‌లను కేటాయించిందిఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట.

నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటుకు గానీ లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఈ ద్రవ్య పెనాల్టీని విధించడం వలన బ్యాంకు పై ఆర్బీఐ చేపట్టే ఏ ఇతర చర్యలపై ఎటువంటి పక్షపాతం వహించదు.

 

(పునీత్ పంచోలి)     
ముఖ్య కార్యనిర్వహణాధికారి

పత్రికా విడుదల: 2024-2025/820

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?