RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S1

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109931846

పశ్చిమ బెంగాల్ హౌరాలో గల హౌరా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో గల హౌరా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 19 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా లక్ష రూపాయలు మాత్రమే ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) మార్గదర్శకాలు, 2016’ విషయంలో ఆర్‌‌.బి.ఐ జారీ చేసిన ఆదేశాలకు కట్టుబడి ఉండటంలో బ్యాంకు విఫలమైనట్లు గుర్తించడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

2023 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని నేషనల్ బ్యాంకు ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్(NABARD) బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీలో ఆర్‌‌.బి.ఐ మార్గదర్శకాలను పాటించలేదని గుర్తించడంతో పాటు, సంబంధిత ఇతర నిర్ధారణల ఆధారంగా తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానం, అదనపు సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ.. ద్రవ్య జరిమానా విధించేలా బ్యాంకు ఆదేశాల ఉల్లంఘనను కొనసాగించిందని పేర్కొంది. బ్యాంకు (i) వినియోగదారుల ఖాతాలకు చెందిన కేవైసీ అప్‌డేట్‌ను కాలానుగుణంగా చేపట్టడంలో విఫలమైందని, (ii) ఖాతాల ప్రమాద వర్గీకరణ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో విఫలమైందని ఆర్‌‌.బి.ఐ గుర్తించింది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు. 

(యోగేష్ దయాళ్)

                                                                                                 చీఫ్జనరల్మేనేజర్

పత్రికా ప్రకటన :2023‌‌-2024/2133

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?