RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

107510874

ది జామ్‌నగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

మే 02, 2023

ది జామ్‌నగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఏప్రిల్ 27, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (‘చట్టం’) సెక్షన్ 26 A (2) క్రింద ఇవ్వబడిన ఆదేశాలను పాటించనందులకు/ ఉల్లంఘించినందులకు; దీనితోపాటు 'ది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014 – బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 సంబంధిత సెక్షన్ 26 A - కార్యాచరణ మార్గదర్శకాలు,’ విషయం పై తేదీ మే 27, 2014 నాటి సర్క్యులర్ కు జతచేయబడ్డ­ “ది డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్, 2014 (స్కీమ్) లోని పేరాగ్రాఫ్ 3, ‘ది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మీ కస్టమర్‌ని తెలుసుకోండి (KYC)) ఆదేశాలు, 2016 యొక్క నిబంధనలు, మరియు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల (నియంత్రణ) చట్టం, 2005 (CIC చట్టం) నిబంధనలు మరియు 'సహకార బ్యాంకుల ద్వారా క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీల సభ్యత్వం' పై RBI ఆదేశాలను పాటించనందులకు/ ఉల్లంఘించినందులకు, ది జామ్ నగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, గుజరాత్ పై (‘బ్యాంక్’) పై 4.10 లక్షల (నాలుగు లక్షల పది వేల రూపాయిలు మాత్రమే) జరిమానా విధించింది. ఆర్బిఐ (RBI) చే జారీ చేయబడిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, ‘చట్టం’ లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A(1)(c) మరియు CIC చట్టంలోని సెక్షన్ 23 (4) తో కలిపి సెక్షన్ 25 (1) (iii) క్రింద ఇవ్వబడ్డ అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యo

మార్చి 31, 2022 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితి ఆధారిత NABARD వారి చట్టబద్ద తనిఖీ మరియు తనిఖీ రిపోర్ట్ పరిశీలన మరియు సంబంధిత అన్ని ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా, మిగతావాటితోపాటు, అర్హతగల క్లెయిమ్ చేయని నిర్దిష్ట ఖాతాలలోని నిల్వలను బ్యాంక్, ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌’ కు బదిలీ చేయలేదని మరియు బ్యాంక్ తన కస్టమర్‌ ఖాతాల రిస్క్ వర్గీకరణ కాలానుక్రమ సమీక్ష నిర్వహించదానికై ఒక వ్యవస్థ ను ఏర్పాటు చేయడంలో విఫలమైందని మరియ ఇపుడున్న కస్టమర్ ల కేవైసీ డాక్యుమెంట్ లను, అనుమానాస్పద లావాదేవీల గుర్తింపు వ్యవస్థ / సాఫ్ట్-వేర్ కాలక్రమ నవీకరణ చేయలేదని, ఇంకా బ్యాంక్ వారు సభ్యులుగా ఉన్న మూడు CICలకు బ్యాంక్ డేటాను నివేదించలేదని (చారిత్రక డేటాతో సహా) ఫలితంగా ‘చట్టం’ లో పైన పేర్కొన్న నిబంధనలను మరియు భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని వెల్లడయ్యింది. దీని ఆధారంగా, ‘చట్టం’ లో పేర్కొన్న నిబంధనలను మరియు ‘చట్టం’ క్రింద ఆర్బిఐ చే ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ సమర్పించిన ప్రత్యుత్తరములు మరియు వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్నతదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా ఆర్బిఐ-RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/158

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?