<font face="mangal" size="3">జామ్‌నగర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, జ - ఆర్బిఐ - Reserve Bank of India
జామ్నగర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, జామ్నగర్ (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్వారా ద్రవ్య జరిమానా విధింపు
తేది: 03/04/2023 జామ్నగర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, జామ్నగర్ (గుజరాత్)పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మార్చి 29, 2023 నాటి ఆదేశం ద్వారా, జామ్నగర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, జామ్నగర్ (గుజరాత్)పై ₹1.00 లక్ష (రూ. ఒక లక్ష మాత్రమే) జరిమానా విధించింది. ఆర్బిఐ జారీ చేసిన ఆదేశాలు - 'ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, రుణాలు మరియు అడ్వాన్సుల ప్రొవిజనింగ్ సంబంధిత విషయాలు', మరియు 'మాస్టర్ డైరెక్షన్ - రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సహకార బ్యాంకులు - డిపాజిట్లపై వడ్డీ రేటు) ఆదేశాలు, 2016’ల ఉల్లంఘనకు ఫై జరీమానా విధించడం జరిగింది. ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా ఉద్దేశించబడలేదు. నేపధ్యము మార్చి 31, 2022 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ, దానికి సంబంధించిన తనిఖీ నివేదిక మరియు రిస్క్ అసెస్మెంట్ నివేదిక మరియు సంబంధిత అన్ని ఉత్తరప్రత్యుత్తరాల పరిశీలనలో, ఆర్బిఐ జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలకు విరుద్ధంగా బ్యాంక్ (i) దాని ఆస్తులను నిరర్ధక ఆస్తులు (NPAలు)గా కొనసాగుతున్న ప్రాతిపదికన గుర్తించలేదు మరియు పరిపక్వత గడువు ముగిసిన తేదీ నుండి తిరిగి చెల్లించే తేదీ వరకు టర్మ్ డిపాజిట్లకు వడ్డీని పొదుపు డిపాజిట్లకు వర్తించే రేటు లేదా ఒప్పంద వడ్డీ రేటు, ఏది తక్కువైతే అది చెల్లించడంలో విఫలమైనదని వెల్లడైంది. దీని ఆధారంగా, ఆర్బిఐ ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంకుకు నోటీసు జారీ చేయబడింది. జారీ చేయబడిన నోటీసుకు బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక సమర్పణ అంశాలను పరిగణలోకి తీసుకున్న తరువాత, ఈ విషయంలో బ్యాంకు ద్వారా ఆర్బిఐ ఆదేశాల ఉల్లంఘన వాస్తవమని మరియు జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2023-2024/5 |