తమిళనాడు, వేలూరు జిల్లాలో గల జోలార్ పేట్ సహకార బ్యాంకుపై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
తమిళనాడు, వేలూరు జిల్లాలో గల జోలార్ పేట్ సహకార బ్యాంకుపై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు
తమిళనాడు వేలూరు జిల్లాలో గల జోలార్ పేట్ సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 12 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.50 వేల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్న సంస్థలకు రుణాలు, అడ్వాన్సులు జారీ’కి ఆర్ బి ఐ నిబంధనల్లో ఉన్న ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్లు – యు సి బి‘ల మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుకు ఈ జరిమానా వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం: 2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో బ్యాంకు డైరెక్టర్లకు, వారి బంధువులకు రుణాలను ఇచ్చిందని వెల్లడైంది. దీంతో, ఆర్ బి ఐ మార్గదర్శకాలను పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించకూడదో తెలుపాలంటూ రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసులు ఇచ్చింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్బీఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.
(యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2023-2024/1246 |