RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129245747

ది కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్,కాంచీపురం తమిళనాడు , పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు.

జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ది బ్యాంకు (నాబార్డ్) వారు, సహకార కేంద్ర బ్యాంకులలో జరిగే ఫ్రాడ్స్ –వర్గీకరణ,నివేదికల సమర్పణ మరియు పర్యవేక్షణలపై జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందుకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు తమ లేఖ తేదీ 11 జూన్ 2024 ద్వారా ది కాంచీపురం కేంద్ర సహకార బ్యాంకు లిమిటెడ్, కాంచీపురం తమిళనాడు పై రు.50,000/-(అక్షరాల ఏభై వేల రూపాయలు) ఆర్ధిక జరిమానా విధించడమైనది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47A(1)(c),{సెక్షన్ 46(4)(i )మరియు సెక్షన్ 56 తో కలిపి చదువుకొనేది}ల ద్వారా సంక్రమంచిన అధికారాల ద్వారా ఈ జరిమానా విధించడమైనది.

పైన తెలిపిన బ్యాంకు యొక్క 2023,మార్చి 31 వ తేదీ నాటి ఆర్ధిక వ్యవహారాలపై నాబార్డ్ వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు. ఆ నివేదిక లోని తనిఖీ అంశాల ఆధారంగా, నాబార్డ్ వారు, పై అంశాలపై జారీ చేసిన ఆదేశాలను పాటించనందుకు,తత్సం బంధిత ఉత్తర ప్రత్యుత్తరాలను పరిశీలించి,ఈ బ్యాంకు పై ఎందుకు ఆర్ధిక జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసినదిగా నోటీసు జారీచేయడమైనది. బ్యాంకు వారు సమర్పించిన వివరణ, మరియు మౌఖిక విచారణలో తెలియచెప్పిన అంశాలను పరిశీలించిన మీదట, నాబార్డ్ వారి తనిఖీ లోని అంశాలలో యాదార్ధతను గుర్తించి, ఈ ఆర్ధిక జరిమానా విధింపు చేపట్టడమైనది.

చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదేవీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు. ఈ ఆర్ధిక జరిమానా విధింపు, భారతీయ రిజర్వు బ్యాంకు ముందు ముందు తీసుకోబోయే చర్యలకు ఆటంకము కాబోదు

 

(పునీత్ పంచోలీ)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రిక ప్రకటన: 2024-2025/493

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?