RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104379198

ది కన్యాకుమారి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగర్కోయిల్, తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

మే 22, 2023

ది కన్యాకుమారి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,
నాగర్కోయిల్, తమిళనాడు పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య
జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) మే 18, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీ లకు వర్తించేమేరకు-AACS) (‘చట్టం’)సెక్షన్ 56తో కలిపి సెక్షన్ 26A ప్రకారం ఏర్పాటు చేసిన ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ (DEA ఫండ్)’కి అర్హత గల నిధులను బదిలీ చేయడంపైన మరియు ‘మీ వినియోగదారుని తెలుసుకోండి (కేవైసీ) డైరెక్షన్, 2016 క్రింద ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ ఉల్లంఘించినందులకు, ది కన్యాకుమారి డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగర్కోయిల్, తమిళనాడు పై (‘బ్యాంక్’) పై 7.50 లక్షల (యేడు లక్షల యాభై వేల రూపాయిలు మాత్రమే) జరిమానా విధించింది. ఆర్బిఐ (RBI) చే జారీ చేయబడిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, ‘చట్టం’ లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకొని ఆర్బిఐ-RBI ద్వారా ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యo

మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితి ఆధారిత తనిఖీ రిపోర్ట్ ద్వారా, మిగతావాటితోపాటు, అర్హతగల క్లెయిమ్ చేయని నిర్దిష్ట ఖాతాలలోని నిల్వలను బ్యాంక్, ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌’ కు బదిలీ చేయలేదని మరియు రిస్క్ వర్గీకరణకు సంబంధించి కేవైసీ-KYC డైరెక్షన్ యొక్క నిబంధనలను ఉల్లంఘించిందని మరియు అదే కస్టమర్‌కు బహుళ కస్టమర్ ఐడెంటిఫికేషన్ కోడ్‌లను కేటాయించడం మొదలగునవి వెల్లడైంది. దీని ఆధారంగా, ‘చట్టం’ లో పేర్కొన్న నిబంధనలను మరియు ‘చట్టం’ క్రింద ఇవ్వబడిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ సమర్పించిన ప్రత్యుత్తరములు మరియు వ్యక్తిగత విచారణ సమయంలో చేసిన మౌఖిక సమర్పణలను పరిగణనలోకి తీసుకున్నతదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా ఆర్బిఐ-RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/263

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?