RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

133666435

కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య జరిమానా విధింపు

బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 20 తో కలిపి చదువదగిన సెక్షన్ 56లో పొందుపరిచిన నిబంధనలు ఉల్లంఘించబడినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జూన్ 23, 2025 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ లిమిటెడ్, తెలంగాణ (బ్యాంక్) వారి పై రూ.1 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించడమైనది.

మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు (NABARD) చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పర్యవేక్షణ ఆధారంగా, చట్టబద్ధమైన మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా, బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన ద్రవ్య జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

ఈ బ్యాంకు, వారి డైరెక్టర్లకు రుణాలను మంజూరు చేసింది.

ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఇట్టి ద్రవ్య జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందున తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఎటువంటి పక్షపాతం వహించదు.

(పునీత్ పంచోళీ) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రిక ప్రకటన: 2025-2026/598

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?