మహారాష్ట్ర లోని ఉల్ హాస్ నగర్ కు చెందిన "ది కోణార్క్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్. - ఆర్బిఐ - Reserve Bank of India
మహారాష్ట్ర లోని ఉల్ హాస్ నగర్ కు చెందిన "ది కోణార్క్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.
'ధరావత్తు ఖాతాల నిర్వహణ - ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులు' కు సంబధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని ఉల్ హాస్ నగర్ కు చెందిన "ది కోణార్క్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 20-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,00,000 (ఒక లక్ష రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది. నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. నేపధ్యం ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2022 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించి పొదుపు ఖాతాలలో కనీస నిల్వ ధనం కంటే తగ్గినపుడు తగ్గిన ధనానికి అనుపాతంలో అపరాధ రుసుములు విధించకుండా స్థిరమైన అపరాధ రుసుములు విధించినట్లు గుర్తించింది. తదనుగుణంగా నిబంధనలు ఉల్లఘించినందుకు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది. ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా ఈ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి బ్యాంకుపై అపరాధ రుసుమును విధించింది. (యోగీష్ దయాళ్) పత్రికా విడుదల: 2023-2024/1407 |