RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108880156

గుజరాత్ రాష్ట్రం లోని అహమ్మదాబాద్ జిల్లా మండల్ పట్టణానికి చెందిన " ది మండల్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

రెక్టర్ లు , బంధువులు మరియు సంస్థలు మొదలైన వానిలో వారు ఇష్టపడిన వారికి అప్పులు, అడ్వాన్స్ లు మరియు దానికి అనుబంధమైన " డైరెక్టర్ లు మొదలైన వారికి అప్పులు, అడ్వాన్స్ లు - డైరెక్టర్ లే హామీ దారులు - స్పష్టీకరణ మరియు 'సహకార బ్యాంకులు - ధరావత్తు ల పై వడ్డీ రేట్లు' కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని అహ్మదాబాద్ జిల్లా మండల్ పట్టణానికి చెందిన "ది మండల్ నాగరిక్ సహకారీ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంక్ 03-11-2023 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,50,000/- (ఒక లక్షా యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1) (C), 46 (4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకుంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

నియంత్రణ సమ్మతిలో జరిగిన లోపాల ఆధారంగా ఈ చర్యలను తీసుకొనబడింది. అంతేకాని బ్యాంక్ యొక్క వినియోగదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావం చూపదు.

నేపధ్యం

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2022 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించి క్రింది అంశాలలో పొరపాట్లు జరిగినట్లు నిర్ధారించింది.

 i) బ్యాంకు డైరెక్టర్ హామీపై బంధువుకు అప్పును మంజూరు చేయడం.

 ii) వర్తించే వడ్డీరేటు ప్రకారం వడ్డీని కట్టకపోవడం.

  (a) ఆదివారం / సెలవు దినం / బ్యాంకు లావాదేవీలు లేని దినము ల మరుసటి దినమున పరిపక్వమైన టెర్మ్ డిపాజిట్లు చెల్లింపు

  (b) పరిపక్వతకు ముందే బ్యాంకులోని ధరావతు సొమ్మును తీసుకోవడం

  (c) తిరిగి చెల్లించవలసిన తేదీకి ముందే పరిపక్వమైన టర్మ్ డిపాజిట్లను తీసుకోవడం.

తదనుగుణంగా నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటిస్ ను జారీ చేసింది.

ఈ నోటీసుకు బ్యాంకువారు పంపిన ప్రత్యుత్తరము, వ్యక్తిగత సమర్పణల ఆధారంగా ఈ బ్యాంకు భారతీయ రిజర్వ్ బ్యాంకు రూపొందించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లు నిర్ధారించి బ్యాంకుపై అపరాధ రుసుము విధించింది.

(యోగీష్ దయాళ్)   
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1377

 

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?