కేరళలోని మలప్పురం జిల్లాలో గల మంజేరి సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
కేరళలోని మలప్పురం జిల్లాలో గల మంజేరి సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు
కేరళలోని మలప్పురం జిల్లా మంజేరిలో గల మంజేరి సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 నవంబర్ 29 నాడు జారీ చేసిన ఆర్డర్ ద్వారా రూ.10 వేల ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ఖాతాదారుల రక్షణ – అనధికారిక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీలలో సహకార బ్యాంకులకు చెందిన ఖాతాదారుల బాధ్యతా పరిమితి”, ‘‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకుల(యు సి బిల) కోసం సమగ్రమైన సైబర్ భద్రతా ఫ్రేమ్‌వర్క్’’ల విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో మంజేరి సహకార పట్టణ బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. నేపథ్యం మోసగాళ్ల ద్వారా బ్యాంకుకు చెందిన మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్‌పై సైబర్ దాడి జరిగిందని మంజేరి సహకార అర్బన్ బ్యాంకు లిమిటెడ్ రిపోర్టు చేసింది. ఆ తర్వాత రిజర్వు బ్యాంకు చేపట్టిన సమాచార సాంకేతిక పరీక్ష(ఐటీఈ)లో బ్యాంకుకు చెందిన సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌లో పలు లోపాలున్నట్లు వెల్లడైంది. దీంతో తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది. షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు మంజేరి సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించదగినదేనని నిర్ధారణకు వచ్చింది. యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన : 2023 - 2024/1172
|