RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129245003

నకోదర్‌‌లో గల నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్‌‌.బి.ఐ

నకోదర్‌‌లో గల నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై 2024 మార్చి 31న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.5 లక్షల(ఐదు లక్షల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. ‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకుల పెట్టుబడుల’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

2023 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఈ తనిఖీలో ఆర్‌‌.బి.ఐ మార్గదర్శకాలను పాటించలేదని గుర్తించడంతో పాటు, సంబంధించిన ఇతర నిర్ధారణల ఆధారంగా, తాము జారీ చేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకుకు రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ.. ప్రుడెన్షియల్ ఇంటర్–బ్యాంకు(గ్రాస్) ఎక్స్‌పోజర్ లిమిట్‌ ఉల్లంఘించడాన్ని కొనసాగించిందని గుర్తించింది. దీంతో, నకోదర్ హిందూ పట్టణ సహకార బ్యాంకుపై ఆర్.బి.ఐ ద్రవ్య జరిమానా విధించింది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

(యోగేష్ దయాళ్)

చీఫ్జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024-2025/150

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?