RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

113522850

కర్ణాటకలోని రాన్‌లో గల ‘రాన్ తాలుకా ప్రైమరీ టీచర్స్ కో–ఆపరేటివ్ బ్యాంకు లిమిటెడ్‌’పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్‌‌.బి.ఐ

కర్ణాటకలోని రాన్‌లో గల రాన్ తాలుకా ప్రైమరీ టీచర్స్ కో–ఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 మే 22న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.75,000(కేవలం రూ.75 వేలు) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘మోసాల పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ మెకానిజం’ మరియు ‘నామమాత్రపు సభ్యత్వానికి సంబంధించిన విధానం, అనుసరణ’ విషయంలో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో రాన్ తాలుకా ప్రైమరీ టీచర్స్ కో–ఆపరేటివ్ బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్.బి.ఐ ఈ జరిమానా వేసింది.

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ, ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, మార్గదర్శకాలు పాటించనందుకు బ్యాంకుపై ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ.. రాన్ తాలుకా ప్రైమరీ టీచర్స్ కో–ఆపరేటివ్ బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేయడమైంది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంకు ద్వారా ఆర్‌‌.బి.ఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, కింద పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని ఆర్.బి.ఐ నిర్ధారణకు వచ్చింది.

తనిఖీ నివేదికలో (i) బ్యాంకు మోసాలను ఆర్.బి.ఐకి నివేదించలేదని (ii) మొత్తం సాధారణ సభ్యుల నిష్పత్తిలో మొత్తం నామమాత్రపు సభ్యుల సంఖ్య నిర్దేశిత పరిమితికి మించి పోయిందని వెల్లడైంది.ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

 

(పునీత్ పాంచోలి)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/427

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?