<font face="mangal" size="3">ది సాహెబ్రావ్ దేశ్‌ముఖ్ కోఆపరేటివ్‌ బ్యాంక&# - ఆర్బిఐ - Reserve Bank of India
ది సాహెబ్రావ్ దేశ్ముఖ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 02, 2023 ది సాహెబ్రావ్ దేశ్ముఖ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) డిసెంబర్ 28, 2022 నాటి తమ ఉత్తర్వు ద్వారా 'మోసాల (ఫ్రాడ్స్) పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ మెకానిజం' పై RBI జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు, ది సాహెబ్రావ్ దేశ్ముఖ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ముంబై (‘బ్యాంక్’) పై ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయిలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (బి.ఆర్. చట్టం) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి RBI నిర్వహించిన చట్టబద్ధమైన తనిఖీ మరియు రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాల పరిశీలనలో, మిగతా వాటితోపాటు, బ్యాంక్ మోసం సంబంధిత కేసులను ఆలస్యం గా నివేదించినట్లు వెల్లడి చేయబడింది. దీనికి అనుగుణంగా, RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటిసుకు బ్యాంక్ యిచ్చిన ప్రత్యుత్తరం, అదనంగా సమకూర్చబడిన అంశాలు మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2022-2023/1485 |