<font face="mangal" size="3px">ది సతారా సహకరి బ్యాంక్ లిమిటెడ్‌, ముంబై పై భ& - ఆర్బిఐ - Reserve Bank of India
ది సతారా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
ఫిబ్రవరి 20, 2023 ది సతారా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ముంబై పై భారతీయ రిజర్వు భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 15, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా, “అడ్వాన్సు ల నిర్వహణ మరియు ఎక్స్పోజర్ నియమాలు మరియు చట్టబద్ధమైన/ఇతర పరిమితులు-UCBలు” అనే విషయాలపై RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు ది సతారా సహకరి బ్యాంక్ లిమిటెడ్, ముంబై (‘బ్యాంక్’) పై ₹4.00 లక్షల (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన చట్టబద్ద తనిఖీ మరియు రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాల పరిశీలనలో, మిగతా విషయాలతో పాటు, నిధుల తుది వినియోగాన్ని పర్యవేక్షించే యంత్రాంగం బ్యాంక్ వద్ద సరైనది లేదని మరియు అనుమతించదగిన పరిమితి కంటే ఎక్కువగా అసురక్షిత అడ్వాన్సులను బ్యాంక్ మంజూరు చేసిందని వెల్లడి చేయబడింది. దీనికి అనుచానంగా, పైన ఉటంకించిన RBI ఆదేశాలను ఉల్లంఘించినందుల కు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరo, అదనంగా చేసిన సమర్పణలు మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1758 |