సేవాలియా పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., సేవాలియా, ఖేడ జిల్ల, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
సేవాలియా పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., సేవాలియా, ఖేడ జిల్ల, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘డైరెక్టర్లకు, బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులు’ మరియు ‘డైరెక్టర్లకు రుణాలు అడ్వాన్సులు వగైరా –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ’ సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా సేవాలియా పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., సేవాలియా, ఖేడ జిల్ల, గుజరాత్ (బ్యాంక్), వారి పై ₹50,000/-(యాభై వేల రూపాయలు) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పరిశీలనలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) బ్యాంకు డైరెక్టర్లలో ఒకరి బంధువు పూచికత్తుగా/హామీదారుగా ఉండడం వలన ఒక వ్యక్తికి ఋణ సౌకర్యం కల్పించబడింది. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం మరియు అట్టి నిర్దేశాలకణుగునంగ బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో ప్రత్యక్ష సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.
(యోగీష్ దయాళ్) ముఖ్య నిర్వహణ అధికారి పత్రికా విడుదల: 2023-2024/1118 |