శిర్పూర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధూలే, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
శిర్పూర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధూలే, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ –UCB’s కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా జనవరి 18, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా శిర్పూర్ పీపుల్స్ సహకార బ్యాంక్ లిమిటెడ్, ధూలే, (మహారాష్ట్ర) (బ్యాంక్) వారి పై ₹200,000/-(రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన మరే ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ చర్యలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా బ్యాంకు డైరెక్టర్ల బంధువులతో ప్రమేయం ఉన్న అవస్థాపనలకు ఋణన్ని మంజూరు చేసినట్లుగా వెల్లడైనది, కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, పైన పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది. యోగేష్ దయాల్ చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన: 2023-2024/1783 |