<font face="mangal" size="3">ది షిర్పూర్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిķ - ఆర్బిఐ - Reserve Bank of India
ది షిర్పూర్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, షిర్పూర్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 09, 2023 ది షిర్పూర్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, షిర్పూర్ భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జనవరి 04, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన / ఇతర పరిమితులు – UCBలు”, ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ (IRAC) మరియు “మీ వినియోగదారులను తెలుసుకోండి (KYC)” అనే విషయాలపై పట్టణ సహకార బ్యాంకులకు RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, ది షిర్పూర్ పీపుల్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, షిర్పూర్ (మహారాష్ట్ర) పై (‘బ్యాంక్’) పై ₹3.00 లక్షల (అక్షరాలా మూడు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2019 మరియు మార్చి 31, 2020 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదికల ద్వారా, మిగతావాటితో కలిపి, బ్యాంక్ (i) అనుమతింపబడిన పరిమితికి మించి రుణగ్రహీతల వొక సమూహానికి అడ్వాన్సులను మంజూరు చేసిందని, (ii) ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ (IRAC) నిబంధనలను పాటించలేదని మరియు (iii) అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి మరియు పర్యవేక్షించడానికి తగిన పటిష్టమైన సాఫ్ట్‌వేర్ లేకపోవడం, అందువల్ల RBI ద్వారా జారీ చేయబడిన పై ఆదేశాలను పాటించలేదని/ ఉల్లంఘించినదని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలు మరియు అదనంగా ఇవ్వబడిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1518 |