RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109740432

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఖమ్మం, తెలంగాణ పై ద్రవ్య జరిమానా (పెనాల్టీ) ని విధించింది.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) డిసెంబర్ 19, 2023 నాటి తమ ఆర్డర్ ద్వారా, స్తంభాద్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, ఖమ్మం, తెలంగాణ (బ్యాంక్) పై  'డైరెక్టర్లు, వారి బంధువులు మరియు వారు ఆసక్తి ఉన్నటువంటి సంస్థలు/అన్యసంస్థల కు రుణాలు మరియు అడ్వాన్సులు' మీద ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను మరియు వీటితోపాటు,    'బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ యూసీబీ (UCB) లు' పై ఆర్బీఐ జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, `50,000/- (రూ. యాభై వేలు మాత్రమే) ద్రవ్య జరిమానాను విధించింది. ఆర్బీఐ జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949  లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్బీఐ  ద్వారా జరిమానా విధింపబడింది.

చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యo

మార్చి 31, 2022 నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జరిపిన చట్టబద్ధమైన తనిఖీ మరియు రిస్క్ అసెస్మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరము(కరస్పాండెన్స్‌) పరిశీలనలో, మిగతావాటితోపాటు, బ్యాంక్ డైరెక్టర్లలో ఒకరికి మరియు బ్యాంక్ డైరెక్టర్లల బంధువులకు రుణాలను బ్యాంక్ మంజూరు చేసిందని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆర్బీఐ ఆదేశాలను పాటించనందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం  మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా ఆర్బీఐ ఆదేశాల ఉల్లంఘన జరిగిందని  పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్)

            చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/1634

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?