RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128941316

గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ నగరానికి చెందిన "ది సుటెక్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"ప్రాధమిక (పట్టణ) సహకార బ్యాంకులకొరకు రూపొందించిన సమగ్ర సైబర్ రక్షణ చట్రం - గ్రేడెడ్ విధానం" మరియు "వాడని ఖాతాలలో కనీస నిల్వ మొత్తం లేని కారణంతో అపరాధ రుసుమును విధించడం" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల గుజరాత్ రాష్ట్రం లోని సూరత్ నగరానికి చెందిన "ది సుటెక్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్"  మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 26-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 5,00,000 (ఐదు  లక్షల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.

ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించిన మార్గదర్శకాలకు భిన్నంగా ఈ బ్యాంకు ప్రవర్తించినట్లు నిర్ధారించి ఈ బ్యాంకు పై అపరాధ రుసుమును యెందుకు విధించకూడదో వివరించాలంటూ సదరు బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ క్రింది అంశాలలో పొరపాట్లు చేసినట్లు గుర్తించి అపరాధ రుసుమును విధించింది.

1)అంతర్జాల చరవాణి అనువర్తనలలోని బలహీనమైన అంశాలను, చొరబాటు పరీక్షను నిర్ధిష్ట ఆవర్తన సమయాలలో నిర్వహించక పోవడం.

2)వాడని ఖాతాలలో కనీస నిల్వ మొత్తం లేని కారణంతో అపరాధ రుసుమును విధించడం.నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.

(పునీత్ పాంచోలి)

ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2024-2025/316

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?