RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

104376357

ది సుటెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరత్ (గుజరాత్) పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

మే 02, 2023

ది సుటెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరత్ (గుజరాత్) పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు

భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఏప్రిల్ 27, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “డైరెక్టర్లు, బంధువులు మరియు సంస్థలు/వారికి వ్యాపార ఆసక్తి ఉన్నసంస్థలకు” రుణాలు మరియు అడ్వాన్స్‌లు/' మరియు 'ప్రైమరీ (అర్బన్) కో-ఆపరేటివ్ బ్యాంక్‌ల (యూసీబీ లు-UCBs) ద్వారా ఇతర బ్యాంకుల్లో డిపాజిట్‌లను ఉంచడం' అనే విషయంపై ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు, ది సుటెక్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, సూరత్ (గుజరాత్) (బ్యాంక్) పై 10.00 లక్షల (పది లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (బిఆర్ యాక్ట్) లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఆర్బిఐ (RBI) ద్వారా ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యo

మార్చి 31, 2022 తేదీ నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి భారతీయ రిజర్వు బ్యాంకు జరిపిన చట్టబద్ధమైన తనిఖీ, తనిఖీ నివేదిక మరియు సంబంధిత రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ మరియు దానికి సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరము(కరస్పాండెన్స్‌)ల పరిశీలనలో, మిగతావాటితోపాటు, బ్యాంక్ (i) దాని డైరెక్టర్లలో ఒకరి బంధువుకు రుణాన్ని మంజూరు చేసిందని మరియు (ii) ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ (స్థూల) ఎక్స్‌పోజర్ నిబంధనలను ఉల్లంఘించిందని, ఫలితంగా ఆర్బిఐ (RBI) ఆదేశాల ఉల్లంఘన జరిగిందని వెల్లడయ్యింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆర్బిఐ (RBI) ఆదేశాలను అమలుపరచనందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక షోకాజ్ నోటీసు జారీ చేయబడింది.

నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరమును మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ(RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాళ్) 
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023-2024/159

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?