RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129247547

ఉద్గీర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, ఉద్గీర్, మహారాష్ట్ర వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘ఎక్స్పొజర్ నిబంధనలు మరియు చట్టబద్ధ/ఇతర నియంత్రణలు-(UCBs)’ మరియు ‘బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ –UCBs’ కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన నిబంధనలను ఉల్లంఘించినందున రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A(1)(c) తో పాటు 46(4)(i) మరియు 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా ఏప్రిల్ 26, 2024 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా ఉద్గీర్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్, ఉద్గీర్, మహారాష్ట్ర (బ్యాంక్) వారి పై 1.00 లక్షలు (లక్ష రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ పర్యవేక్షణ ఫలితంగా, ఆర్బీఐ రూపొందించిన మార్గదర్శకాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా, ఇట్టి విషయమై సంబంధిత ఉత్తరప్రత్యుత్తరాలు జరిపిన పిమ్మట బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, అలాగే బ్యాంకు సమర్పించిన అదనపు సమాచారం ఆధారంగా - బ్యాంకు డైరెక్టర్ యొక్క బంధువుకు రుణాల మంజూరు/పునరుద్ధరణ జరిపినదన్న విషయం ఋజువైనందున సదరు బ్యాంకుపై ఆర్బీఐ నగదు జరిమానా విధింపు చర్య చేపట్టవలసివచ్చినది.ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర ఒప్పందాల చెల్లుబాటు లేదా లావాదేవిల విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు, అంతేగాక ఇట్టి నగదు జరిమానా బ్యాంక్ నిర్దిష్ట నిబంధనల ఉల్లంఘనలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, కావున బ్యాంకు పై చేపట్టే ఏ ఇతర చర్యలపై భారతీయ రిజర్వ్ బ్యాంకు ఎటువంటి పక్షపాతం వహించదు.

 (యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2024-2025/234

 

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?