RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

129511208

కటక్ కు చెందిన "ది అర్చన్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"భారతీయ రిజర్వ్ బ్యాంకు - మీ ఖాతాదారుని గుర్తించు (కె వై సీ) నిర్ధేశకాలు" మరియు నిబంధనలను బహిర్గత పరచుట మరియు చటబద్ధమైన/ఇతర పరిమితులు- పట్టణ సహకారబ్యాంకులు" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల కటక్ కు చెందిన ది అర్చన్  కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 22-08-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 1,50,000 (ఒక లక్ష ఏభై వేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (1)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ అపరాధ రుసుమును విధించింది.

బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2023 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. విచారణ నివేదిక, బాధక అంచనా నివేదిక మరియు దీనికి సంబంధించిన అన్నీ ఇతర అంశాలను కూలంకషంగా పరిశీలించి క్రింది అంశాలలో పొరపాట్లు జరిగినట్లు నిర్ధారించింది. (i) ఖాతాల విభాగీకరణ లోని బాధకానికి సంబంధించి క్రమానుగత సమీక్షలు నిర్వహించకపోవడం(ii)      మోసాన్ని గురించి నిర్ధేశిత కాలవ్యవధిలో భారతీయ రిజర్వ్ బ్యాంకుకు నివేదించకపోవడం(iii) అంతర్గత బ్యాంకు (కౌంటర్ పార్టీ) బహిరంగ పరిమితిని అధిగమించడం.

నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము, దాఖలు పరచిన అదనపు సమాచారము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ క్రమానుగత సమీక్షల ద్వారా కనీసం ఆరు నెలలకు ఒక సారి ప్రమాదకరమైన ఖాతాలను గుర్తించటానికి యెటువంటి వ్యవస్తను రూపొందించనట్లు నిర్ధారించిందినియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.

(పునీత్ పాoచోలి)     
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2024-2025/981

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?