<font face="mangal" size="3">ది ఉత్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భువన - ఆర్బిఐ - Reserve Bank of India
ది ఉత్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భువనేశ్వర్, ఒడిశా పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
ఫిబ్రవరి 06, 2023 ది ఉత్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భువనేశ్వర్, ఒడిశా భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జనవరి 31, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా (i) “ఎక్స్పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన / ఇతర పరిమితులు – UCBలు”, మరియు (ii) సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) కింద జారీ చేయబడిన RBI నిర్దిష్ట ఆదేశాలను ఉల్లంఘించినందులకు/ పాటించనందులకు ది ఉత్కల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, భువనేశ్వర్, ఒడిశా పై (‘బ్యాంక్’) పై ₹15.00 లక్షలు (రూ. పదిహేను లక్షలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక ద్వారా, మిగతావాటితో కలిపి, బ్యాంక్ (i) ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ (స్థూల) ఎక్స్పోజర్ నిబంధనలు మరియు ప్రుడెన్షియల్ ఇంటర్-బ్యాంక్ కౌంటర్పార్టీ పరిమితులను ఉల్లంఘించిందని మరియు (ii) SAF కింద జారీ చేయబడిన నిర్దిష్ట ఆదేశాలను ఉల్లంఘించి, డిపాజిట్లపై SBI అందించే దాని కంటే ఎక్కువ వడ్డీని చెల్లించాలనే ఆదేశాలను ఉల్లంఘించినదని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం, మరియు అదనంగా ఇవ్వబడిన సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1673 |