<font face="mangal" size="3">ది వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమĹ - ఆర్బిఐ - Reserve Bank of India
ది వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పర్లి వైజ్నాథ్, బీడ్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
ఫిబ్రవరి 13, 2023 ది వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పర్లి వైజ్నాథ్, బీడ్ (మహారాష్ట్ర) భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 07, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (చట్టం) లోని సెక్షన్ 56 తో కలిపి సెక్షన్ 36(1) ప్రకారం, సూపర్‌వైజరీ యాక్షన్ ఫ్రేమ్‌వర్క్ (SAF) కింద RBI జారీ చేసిన నిర్దిష్ట ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, ది వైద్యనాథ్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, పర్లి వైజ్నాథ్, బీడ్ (మహారాష్ట్ర) (‘బ్యాంక్’) పై ₹1.50 లక్షలు (రూ. ఒక లక్ష మరియు యాభైవేలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక ద్వారా, మిగతావాటితో కలిపి, SAF కింద భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన కార్యాచరణ ఆదేశాలను ఉల్లంఘిస్తూ ‘బ్యాంక్’ విరాళం ఇచ్చినట్లు వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరాలు, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1715 |