RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128940556

మహారాష్ట్ర లోని వైజాపూర్ కు చెందిన "ది వైజాపూర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" పై అపరాధ రుసుమును విధించిన భారతీయ రిజర్వ్ బ్యాంక్.

"పర్యవేక్షక చర్యల చట్రం" కు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ప్రవర్తించిన కారణం వల్ల మహారాష్ట్ర లోని వైజాపూర్ కు చెందిన "ది వైజాపూర్ మర్చంట్స్ కో ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్" మీద భారతీయ రిజర్వ్ బ్యాంకు 25-04-2024 తేదీన విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం రు 2,50,000 (రెండు లక్షల యాభైవేల రూపాయలు మాత్రమే) అపరాధ రుసుమును విధించింది. బ్యాంకుల నియంత్రణ చట్టం 1949 లోని 47A (i)(C), 46(4)(i) మరియు 56 విభాగాలలోని నిబంధనలకు అనుగుణంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు తనకు సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకొంటూ ఈ అపరాధ రుసుమును విధించింది.ఈ బ్యాంకు యొక్క ఆర్ధిక స్థితిగతులపై 31-03-2024 తేదీన భారతీయ రిజర్వ్ బ్యాంకు చట్టబద్ధమైన విచారణ జరిపింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గ నిర్దేశకాలను సదరు బ్యాంక్ పాటించనట్లు గుర్తించి ఈ విషయంలో సదరు బ్యాంక్ తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల ఆధారంగా సదరు బ్యాంకు పై ఎందుకు చర్య తీసుకోకూడదో వివరించాలంటూ బ్యాంకుకు ఒక నోటీసును జారీ చేసింది.ఈ నోటీసుకు బ్యాంకు వారు పంపిన ప్రత్యుత్తరము మరియు మౌఖిక సమర్పణల ఆధారంగా సదరు బ్యాంక్ పర్యవేక్షక చర్యల చట్రం జారీచేసిన నిభంధనలను అతిక్రమించి తాజా తనఖా అప్పులను మంజూరు చేసినట్లు నిర్ధారించి సదరు బ్యాంకుపై అపరాధ రుసుమును విధించింది. నియమ నిబంధనలను సరిగా పాటించని కారణంగా ఈ చర్య తీసుకోబడింది. అంతే కానీ బ్యాంకు యొక్క ఖాతాదారులు జరుపుతున్న లావాదేవీలు, ఒప్పందాలపై ఈ చర్య ఎటువంటి ప్రభావము చూపదు. అపరాధ రుసుము విధించినప్పటికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ సదరు బ్యాంక్ పైన మరేదైనా చర్య తీసుకొనే అధికారం కలిగి వుంటుంది.

(పునీత్ పాంచోలి)  
ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదలी: 2024-2025/302

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?