RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78527893

ది వైజాపూర్ మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వైజాపూర్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBl) ద్రవ్య జరిమానా విధింపు

ఫిబ్రవరి 20, 2023

ది వైజాపూర్ మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వైజాపూర్ (మహారాష్ట్ర)
పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBl) ద్రవ్య జరిమానా విధింపు

ది వైజాపూర్ మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, వైజాపూర్ (మహారాష్ట్ర) (‘బ్యాంక్’) పై, పట్టణ సహకార బ్యాంకులకు RBI జారీ చేసిన “ఆదాయ గుర్తింపు మరియు ఆస్తుల వర్గీకరణ నియమాలు (IRAC నియమాలు)” పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, RBI ఫిబ్రవరి 14, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా, 4.00 లక్షలు (నాలుగు లక్షల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పైన పేర్కొన్న ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధించబడింది.

ఈ చర్య నియంత్రణ అనుపాలనల లోపాలపై ఆధారపడి తీసుకున్నదే తప్ప, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపధ్యము

బ్యాంక్ యొక్క మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంగా చేపట్టిన తనిఖీ నివేదిక ద్వారా, మిగతావాటితో కలిపి, బ్యాంక్ RBI చే జారీ చేయబడిన పైన పేర్కొన్నIRAC నియమాలను పాటించకుండా/ఉల్లంఘించి నిర్దిష్ట ఖాతాలను నిరర్ధక ఆస్తులుగా వర్గీకరించలేదని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది.

బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరములు మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖిక అంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఈ విషయంలో బ్యాంక్ ద్వారా RBI జారీ చేసిన ఆదేశాలు పాటించడం లేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదిగా, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2022-2023/1753

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?