RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Theme
Theme
Text Size
Text Size
S3

Notification Marquee

आरबीआई की घोषणाएं
आरबीआई की घोषणाएं

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128939844

గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో గల వల్సాద్ మహిళా నాగరిక్ సహకారి బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించిన ఆర్‌‌.బి.ఐ

గుజరాత్‌లోని వల్సాద్‌ జిల్లాలో గల వల్సాద్ మహిళా నాగరిక్‌ సహకారి బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) 2024 ఆగస్టు 14న జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.25 లక్షల (లక్షా ఇరవై ఐదు వేల రూపాయల) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్, ఇతర సంబంధిత విషయాలు –యూఎస్‌బీల’ మార్గదర్శకాలు, ‘కో–ఆపరేటివ్ బ్యాంకుల ద్వారా క్రెడిట్ సమాచార కంపెనీల(సీఐసీల) సభ్యత్వం’, ‘మీ వినియోగదారున్ని తెలుసుకోండి(KYC) నిబంధనలు’, ‘డిపాజిట్ అకౌంట్ల నిర్వహణ–ప్రాథమిక(పట్టణ) కో–ఆపరేటివ్ బ్యాంకుల’ విషయాల్లో ఆర్.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి లేకపోవడంతో ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c), క్రెడిట్ సమాచార కంపెనీల(నియంత్రణ) చట్టం, 2005లోని సెక్షన్ 25 కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది.2023 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ, ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలకు బ్యాంకు కట్టుబడి లేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా, మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ బ్యాంకుకు షోకాజు నోటీసు జారీ చేయడమైంది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు, ఇతర సమర్పణలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, కింద పేర్కొన్న అభియోగాలు వాస్తవమని, మార్గదర్శకాల ఉల్లంఘన జరిగిందని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. బ్యాంకు (i) ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ, ప్రొవిజనింగ్ నిబంధనలకు సంబంధించి నిర్దిష్ట రుణ ఖాతాలను నాన్–పర్‌‌ఫార్మింగ్ అసెట్‌(నిరర్ధక ఆస్తి)గా వర్గీకరించడంలో విఫలమైంది (ii) 2023 మార్చి 31 నాటికి మూడు

సీఐసీలకు డేటాను(చారిత్రాత్మక డేటాతో కలిపి) సమర్పించడంలో విఫలమైంది. (iii) నిర్దేశిత కాలానుగుణంగా రిస్క్ ఆధారంగా కేవైసీ అప్‌డేట్‌ ప్రక్రియను చేపట్టలేదు. (iv) గత రెండేళ్లకు పైగా కస్టమర్ నుంచి ఎలాంటి లావాదేవీ జరగని ఖాతాలను ఇన్‌ఆపరేటివ్/డోర్మాంట్ ఖాతాలుగా వర్గీకరించడంలో విఫలమైందని తేలింది.ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు.

(పునీత్ పాంచోలి)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024‌‌ - 2025/976

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?