ది వీరంగం మర్కంటైల్ సహకార బ్యాంకు లిమిటెడ్ వీరంగం, అహమ్మదాబాద్ జిల్లా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పెనాల్టి విధింపు. - ఆర్బిఐ - Reserve Bank of India
ది వీరంగం మర్కంటైల్ సహకార బ్యాంకు లిమిటెడ్ వీరంగం, అహమ్మదాబాద్ జిల్లా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక పెనాల్టి విధింపు.
పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను, డైరెక్టర్లు హామీదారులుగా/ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు, పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందుకు, పర్యవేక్షక చర్యల విధానములను ఉల్లంఘించినందుకు, ది వీరంగం మర్కంటైల్ సహకార బ్యాంకు లిమిటెడ్ వీరంగం, అహమ్మదాబాద్ జిల్లా, గుజరాత్ పై, భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారా రు.5.00 లక్షల (అక్షరాల అయిదు లక్షల రూపాయలు )జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదీవీల ప్రామాణికతకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు (i) బ్యాంకు డైరెక్టర్ల బంధువుల హామీపై /ష్యూరిటి పై రుణాలు మంజూరు చేయుట (ii)ఈ బ్యాంకుకు, ఇతర బ్యాంకులకు మధ్య ఉండవలసిన విచక్షణా యుతంగా నిర్ణయించబడిన కౌంటర్ పార్టీ అత్యధిక ఆర్ధిక పరిమితుల ఉల్లంఘన, (iii) పర్యవేక్షక చర్యల పరిధిని ఉల్లంఘించి, భారతీయ స్టేట్ బ్యాంకు ఇచ్చే వడ్డీ రేటు కంటే ఎక్కువ వడ్డీ రేటు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబద్డమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది. యోగేష్ దయాళ్ పత్రిక ప్రకటన 2023-2024/920 |