ది వఘోడియా పట్టణ సహకార సహకార బ్యాంకు లిమిటెడ్,వడోదర జిల్లా, గుజరాత్ పై - భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
ది వఘోడియా పట్టణ సహకార సహకార బ్యాంకు లిమిటెడ్,వడోదర జిల్లా, గుజరాత్ పై - భారతీయ రిజర్వు బ్యాంకు ఆర్ధిక జరిమానా ( పెనాల్టీ ) విధింపు
పట్టణ సహకార బ్యాంకుల లో తమ డైరెక్టర్లకు ఇవ్వదలచిన రుణాల విషయములోను , డైరెక్టర్లు హామిదారులుగా/ ష్యూరిటి దారులుగా వున్నప్పుడు పాటించవలసిన నిబంధనలను ఉల్లంఘించి నందులకు,మరియు వారికి వారి బంధువులకు లాభము చేకుర్చే సంస్థలకు/కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడున్నూ, పట్టణ సహకార బ్యాంకులు తమ డిపాజిట్లను ఇతర బ్యాంకులలో పెట్టేటప్పుడు, భారతీయ రిజర్వు బ్యాంకు, “సహకార బ్యాంకులు – డిపాజిట్లు వడ్డిరేట్లు,2016” అనే అంశం మీద ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించి నందుకున్నూ , ది వఘోడియా పట్టణ సహకార బ్యాంకు లిమిటెడ్,వడోదర జిల్లా, గుజరాత్ పై భారతీయ రిజర్వు బ్యాంకు, తమ ఉత్తర్వు తేది 22/08/2023 ద్వారా రు.5.00 లక్షల (అక్షరాల అయిదు లక్షల రూపాయలు మాత్రమె)జరిమానా విధించినది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టము 1949 లోని సెక్షన్ 47 ఎ(1) (సి) మరియు సెక్షన్ 46(4)( ఐ) మరియు సెక్షన్ 56 ల ద్వారా తమకు సంక్రమించిన అధికారాలకు లోబడి రిజర్వు బ్యాంకు ఈ జరిమానా ను విధించడమైనది. చట్టబద్ధముగా పాటించవలసిన ఆదేశాలను పాటించకపోవడము అనే లోపము వలన ఈ చర్య తీసుకోవడము జరిగింది కాని, సదరుబ్యాంకు తమఖాతాదారులతో చేసుకున్న ఒప్పందాలు లేదా లావాదే వీల ప్రామాణికతలకు సంబంధించినది కాదు . నేపధ్యము ఈ బ్యాంకు యొక్క 31-03-2022 తేది నాటి ఆర్ధిక పరిస్థితి ప్రామాణికముగా రిజర్వు బ్యాంకు వారు చట్ట బద్ధ తనిఖీ నిర్వహించారు .ఆ తనిఖీ నివేదికను,ముప్పు(రిస్క్) అంచనాల నివేదిక మరియు తత్సంబంధిత పత్రములను పరిశీలించిన మీదట బహిర్గతమైన అంశాలు(ఎ) డైరెక్టర్ల బంధువులు హామీదారులుగా వున్న వ్యక్తి కి పరపతి సౌకర్యము కలిగించుట,(బి) విజ్ఞతతో నిర్ణయించ బడిన బ్యాంకుల మధ్య ఉండాల్సిన కౌంటర్ పార్టీ అత్యధిక పరిమితులను ఉల్లంఘించుట (సి) కాల పరిమితి ముగిసిన రికరింగ్ డిపాజిట్ పై ఆరోజు నుండి, డిపాజిట్ చెల్లించే రోజు వరకు అయిన కాలానికి సేవింగ్స్ వడ్డీ రేటు గాని లేదా ఒప్పందపు వడ్డీ రేటు గాని ఏది తక్కువైతే దానిని చెల్లించక పోవుట(డి) కాల పరిమితి డిపాజిట్ ముగిసిన తేది, బ్యాంకు సెలవు రోజున గాని, బ్యాంకు పనిదినము గాని రోజు గాని అయివుండి ,ఆ మరుసటి పనిదినము నాడు ఆ డిపాజిట్ చెల్లించినట్లైతే ఆ సెలవు రోజు/లకు వడ్డి చెల్లించక పోవుట. తదనుగుణంగా,పైన పొందుపరచిన అవకతవకలు జరిగినందులకు గాను, భారతీయ రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించనందులకుగాను ఈ బ్యాంకుపై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వ వలసినదిగా బ్యాంకు కు నోటీసు ఇవ్వడమైనది. ఈ బ్యాంకు సమర్పించిన వివరణ పరిశీలించిన మీదట, వ్యక్తిగత మౌఖిక విచారణ లో వాదన విన్నమీదట,రిజర్వు బ్యాంకు వారు సూచించిన చట్టబధ్దమైన ఆదేశాల ఉల్లంఘన జరిగిందని నిర్ధారించుకుని ఈ బ్యాంకు పై ఆర్ధిక పరమైన జరిమానాను విధించడమైనది.
యోగేష్ దయాళ్ పత్రికా ప్రకటన 2023-2024/921 |