RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

128945638

తమిళనాడులోని తిరుమంగళంలో గల తిరుమంగళం సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ

తమిళనాడులోని తిరుమంగళంలో గల తిరుమంగళం సహకార పట్టణ బ్యాంకు లిమిటెడ్‌పై 2024 ఫిబ్రవరి 28 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.25,000(ఇరవై ఐదు వేల రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధిస్తున్నట్లు భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్.బి.ఐ) ప్రకటించింది. డైరెక్టర్లకు, బంధువులకు, వారు ఆసక్తి ఉన్నటు వంటి సంస్థలు/అన్యసంస్థలకు రుణాలు, అడ్వాన్సుల విషయంలో యూసీబీల బోర్డు ఆఫ్ డైరెక్టర్ల నిబంధనలకు సంబంధించి ఆర్‌‌.బి.ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విఫలం కావడంతో బ్యాంకుపై ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్‌‌.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా విధించింది.

2022 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ, బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్‌‌.బి.ఐ మార్గదర్శకాలను అనుసరించడంలో బ్యాంకు విఫలమైందని గుర్తించడంతో పాటు, ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా.. తాము జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ తిరుమంగళం కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు ఆర్.బి.ఐ షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌.బి.ఐ.. బ్యాంకు తన డైరెక్టర్లకు, వారి బంధువుకు రుణాలు మంజూరు చేయడాన్ని కొనసాగిందని గుర్తించింది. దీంతో, ఆదేశాల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించి, ద్రవ్య జరిమానా విధించింది.

ఆర్‌‌.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు. 

(యోగేష్దయాళ్)

చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2024- 2025/37

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?