<font face="mangal" size="3">తిరుపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ - ఆర్బిఐ - Reserve Bank of India
తిరుపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగ్‌పూర్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
జనవరి 09, 2023 తిరుపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగ్‌పూర్ (మహారాష్ట్ర) భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) జనవరి 04, 2023 నాటి తమ ఉత్తర్వు ద్వారా “మీ వినియోగదారులను తెలుసుకోండి (KYC)” అనే విషయంపై పట్టణ సహకార బ్యాంకులకు RBI జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, తిరుపతి అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, నాగ్‌పూర్ (‘బ్యాంక్’) పై ₹50,000/- (అక్షరాలా యాభైవేల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 తేదీనాటి బ్యాంక్ ఆర్థిక స్థితి గతులను సూచించే రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్ పరిశీలనలో, మిగతావాటితోపాటు, బ్యాంక్ పైన పేర్కొన్న RBI ఆదేశాల ప్రకారం తన కస్టమర్‌ల KYC ని కాలానుక్రమంగా నవీకరణ చేయకుండా, ఆదేశాలను ఉల్లంఘించిందని వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, RBI ఆదేశాలను ఉల్లంఘించినందులకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. బ్యాంక్ యొక్క ప్రత్యుత్తరములు, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1519 |