RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

108880669

గుజరాత్, వడోదరలోని ఉమా సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ ద్రవ్య జరిమానా విధింపు

గుజరాత్, వడోదరలోని ఉమా సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 అక్టోబర్ 4 నాటి ఉత్తర్వు ద్వారా రూ.7  లక్షల జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ప్రాథమిక(పట్టణ) సహకార బ్యాంకులు(యు సి బిల) ఇతర బ్యాంకులలో ఉంచే డిపాజిట్ల” విషయంలో ఆర్ బి ఐ జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో ఉమా సహకార బ్యాంకు విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు.

నేపథ్యం

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టపరమైన తనిఖీలు నిర్వహించింది. తనిఖీ నివేదిక, ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో బ్యాంకు (i) నిర్దేశిత ఇంటర్–బ్యాంకు కౌంటర్‌‌ పార్టీ ఎక్స్‌పోజర్ పరిమితిని (ii) నిర్దేశిత ఇంటర్–బ్యాంకు గ్రాస్ ఎక్స్‌పోజర్ పరిమితిని ఉల్లంఘించినట్లు వెల్లడైంది. దీంతో తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ ఉమా సహకార బ్యాంకుకు రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది. 

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌ బి ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని గుర్తించడంతో, ఉమా సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించదగినదేనని నిర్ధారణకు వచ్చింది.

యోగేష్ దయాళ్   
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన : 2023‌‌ - 2024/1203

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?