వాద్నగర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వాద్నగర్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు - ఆర్బిఐ - Reserve Bank of India
వాద్నగర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వాద్నగర్, గుజరాత్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు
‘డైరెక్టర్లు, వారి బంధువులకు, వారికి ప్రమేయం ఉన్న వ్యాపార సంస్థలకు/స్థాపనలకు ఋణాలు మరియు అడ్వాన్సులకు’ మరియు ‘డైరెక్టర్లకు ఋణాలు మరియు అడ్వాన్సులు మరియు ఇతరాలు. –డైరెక్టర్లు పూచికత్తుగా/హామీదారులుగా- స్పష్టీకరణ” మరియు ‘సహకార బ్యాంకులు-డిపాజిట్లపై వడ్డీ రేట్ల’కు సంబంధించి ఆర్బీఐ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(i) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 18, 2023 తేదీన జారీ చేసిన ఒక ఉత్తర్వు ద్వారా వాద్నగర్ నాగరిక్ సహకారి బ్యాంక్ లిమిటెడ్, వాద్నగర్, గుజరాత్ (బ్యాంక్) వారి పై ₹2 లక్షలు (రెండు లక్షల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది. ఇట్టి చర్య బ్యాంక్ నిర్దిష్ట నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి ఇతర లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు. నేపథ్యం: మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి ఆర్బిఐ చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది. ఈ పరిశీలనలో భాగంగా తనిఖీ నివేదిక, రిస్క్ అంచనా నివేదిక మరియు దానికి సంబంధించిన అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన ద్వారా వెల్లడైన అంశాలు (i) బ్యాంకు డైరెక్టర్లలో ఒకరితో బంధుత్వం ఉన్న వ్యక్తి జమానతుగా (గ్యారంటర్) ఉండడం వలన ఋణ సౌకర్యం కల్పించబడింది, మరియు (ii) బ్యాంకు వద్దనుండి కాల పరిమితి దాటిన టర్మ్ డిపాజిట్లపై మెచూరిటీ చెందిన సమయం నుండి తిరిగి చెల్లించే తేదీ వరకు వర్తించే వడ్డీని చెల్లించలేదు. కావున ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించుటలో వైఫల్యం కారణంగా బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది. భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది. (యోగీష్ దయాళ్) పత్రికా విడుదల: 2023-2024/1142
|