RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109744941

మహారాష్ట్ర సోలాపూర్‌‌లోని విద్యానంద్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ఆర్‌‌ బి ఐ ద్రవ్య జరిమానా విధించింది.

మహారాష్ట్ర సోలాపూర్‌‌లోని విద్యానంద్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్ బి ఐ) 2023 డిసెంబర్ 7 నాడు జారీ చేసిన ఉత్తర్వు ద్వారా రూ.1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు) జరిమానా విధిస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకులు(యూసీబీల) ఇతర బ్యాంకుల వద్ద ఉంచే డిపాజిట్లు మరియు ప్రాథమిక(అర్బన్) సహకార బ్యాంకుల పెట్టుబడుల విషయంలో ఆర్‌‌ బి ఐ మార్గదర్శకాలను కలుపుకుని యూసీబీల ఎక్స్‌పోజర్ నిబంధనలు మరియు చట్టబద్ధమైన/ఇతర నిబంధనలకు సంబంధించి రిజర్వు బ్యాంకు జారీ చేసిన మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటంలో విద్యానంద్ సహకార బ్యాంకు లిమిటెడ్ విఫలం కావడంతో ఈ జరిమానాను వేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలిపి, సెక్షన్ 47A(1)(c)లోని అధికారాలను వినియోగించుకుని ఆర్ బి ఐ ద్వారా ఈ జరిమానా విధింపబడింది.

ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు.

నేపథ్యం:

2022 మార్చి 31 నాటికి బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్ బి ఐ చట్టపరమైన తనిఖీ నిర్వహించింది. ప్రమాద అంచనా నివేదిక, ఇతర సంబంధిత నివేదికల పరిశీలనల్లో బ్యాంకు ప్రుడెన్షియల్ ఇంటర్–బ్యాంకు గ్రాస్ ఎక్స్‌పోజర్ పరిమితిని ఉల్లంఘించినట్లు వెల్లడైంది. దీంతో, తమ మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు బ్యాంకుపై జరిమానా విధించకూడదో తెలుపాలంటూ విద్యానంద్ సహకార బ్యాంకుకు రిజర్వు బ్యాంకు షోకాజు నోటీసు జారీ చేసింది.

షోకాజు నోటీసుకు బ్యాంకు ఇచ్చిన ప్రత్యుత్తరం, వ్యక్తిగత విచారణ సమయంలో బ్యాంకు మౌఖికంగా తెలిపిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకున్న ఆర్‌‌ బి ఐ.. ఆదేశాల ఉల్లంఘన జరిగిందని, పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని గుర్తించడంతో, విద్యానంద్ సహకార బ్యాంకు లిమిటెడ్‌పై ద్రవ్య జరిమానా విధించదగినదేనని నిర్ధారణకు వచ్చింది.

(యోగేష్ దయాల్)
చీఫ్ జనరల్ మేనేజర్

పత్రికా ప్రకటన: 2023‌‌-2024/1559

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?