RbiSearchHeader

Press escape key to go back

Past Searches

Page
Official Website of Reserve Bank of India

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

109100961

విధ్యాసాగర్ కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, మిడ్నాపూర్, పశ్చిమ బెంగాల్ వారిపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ నగదు జరిమానా విధింపు

‘గృహఋణాలకు’ సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ రూపొందించిన మార్గనిర్ధేశాలను అనుసరించకపోవడం వలన రిజర్వ్ బ్యాంక్ తనకు బ్యాంకింగ్ నియంత్రణ చట్టం -1949 లోని సెక్షన్ 47A (1)(c) తో పాటు 46 (4)(I) మరియు సెక్షన్ 56 ల ద్వారా సంక్రమించిన అధికారం ఆధారంగా సెప్టెంబర్ 14, 2023 తేదీన జారీ చేసిన ఉత్తర్వు ద్వారా విధ్యాసాగర్ కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, మిడ్నాపూర్, పశ్చిమ బెంగాల్ వారిపై ₹1.50 లక్షలు (ఒక లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే) నగదు జరిమానా విధించడమైనది.

ఇట్టి చర్య బ్యాంక్ నిబంధనలను పాటించడంలో లోపాలకు గాను తీసుకున్న చర్య మాత్రమే, ఇది ఆ బ్యాంక్ తన ఖాతాదారులతో నెరిపిన ఎటువంటి లావాదేవిలతో గానీ, ఒప్పందాల చెల్లుబాటు విషయాలకు గానీ ఉద్దేశించినది కాదు.

నేపథ్యం:

మార్చి 31, 2022 నాటికి బ్యాంక్ యొక్క ఆర్థిక స్థితికి సంబంధించి నాబార్డ్ (NABARD) చట్టబద్ధమైన తనిఖీని నిర్వహించింది.  ఈ తనిఖీలో భాగంగా అన్ని ప్రత్యుత్తరాల సమగ్ర పరిశీలన జరిపిన పిమ్మట ఒక కేంద్ర సహకార బ్యాంక్ వ్యక్తిగత ఋణగ్రహీతకు గృహఋణ మంజూరు పరిమితిని నియంత్రించుటలో ఆర్బిఐ రూపొందించిన విదివిధానాలను అనుసరించడంలో విఫలమైందన్న విషయం వెల్లడైనది.

కావున ఆర్బిఐ రూపొందించిన నిర్దిష్ట నిబంధనలను పాటించనందున బ్యాంకు పై ఎందుకు జరిమానా విధించరాదో వివరణ ఇవ్వవలసిందిగా నోటీసు జారీచేయడమైనది.

భారతీయ రిజర్వ్ బ్యాంకు నోటీసుకు బ్యాంకు వారి వివరణ పరిశీలించిన తరువాత, మరియు బ్యాంకుతో సంప్రదింపుల్లో భాగంగా వారి మౌఖిక వివరణ పరిగణించిన పిమ్మట, లోగడ పేర్కొన్న నిర్దిష్ట నిబంధనలను అనుసరించుటలో లోపాలకు గాను ఆర్బిఐ విధించిన నగదు జరిమానా సరియైనది, సహేతుకమైనదిగా నిర్ధారించడమైనది.

 

(యోగీష్ దయాళ్)

ముఖ్య నిర్వహణ అధికారి

పత్రికా విడుదల: 2023-2024/1067

 

RbiTtsCommonUtility

प्ले हो रहा है
వినండి

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి మరియు తాజా వార్తలకు త్వరిత యాక్సెస్ పొందండి!

మా యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి QR కోడ్‌ను స్కాన్ చేయండి

RbiWasItHelpfulUtility

పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ:

ఈ పేజీ ఉపయోగకరంగా ఉందా?