కర్ణాటకలోని హుబ్లిలో గల విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ - ఆర్బిఐ - Reserve Bank of India
కర్ణాటకలోని హుబ్లిలో గల విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్‌పై ద్రవ్య జరిమానా విధించిన ఆర్.బి.ఐ
సంబంధించి ఆర్.బి.ఐ జారీ చేసిన కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండటంలో విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్ విఫలం కావడంతో భారతీయ రిజర్వు బ్యాంకు ఈ జరిమానా విధించింది. బ్యాంకింగ్ నియంత్రణా చట్టం, 1949లోని సెక్షన్ 46(4)(i) మరియు సెక్షన్ 56తో కలుపుకుని, సెక్షన్ 47A(1)(c) కింద ఆర్.బి.ఐకి కల్పించబడిన అధికారాలను వినియోగించుకుని ఈ జరిమానా వేసింది. 2022 మార్చి 31 నాటికి ఉన్న బ్యాంకు ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న ఆర్.బి.ఐ ఆ బ్యాంకుపై చట్టబద్ధమైన తనిఖీ నిర్వహించింది. ఆర్.బి.ఐ మార్గదర్శకాలను పాటించలేదని గుర్తించడంతో పాటు ఇతర సంబంధిత నిర్ధారణల ఆధారంగా జారీచేసిన మార్గదర్శకాలను పాటించనందుకు ఎందుకు ద్రవ్య జరిమానా విధించకూడదో తెలుపాలంటూ విశ్వకల్యాణ్ సహకార బ్యాంకు నియమిత్‌కు షోకాజు నోటీసు జారీ చేయడమైంది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ సందర్భంగా ఇవ్వబడిన మౌఖిక సమర్పణలు పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ప్రుడెన్షియల్ ఇంటర్–బ్యాంకు(గ్రాస్) మరియు కౌంటర్ పార్టీ ఎక్స్‌పోజర్ లిమిట్‌ను బ్యాంకు పాటించలేదని ఆర్.బి.ఐ గుర్తించింది. దీంతో ఆదేశాల ఉల్లంఘన జరిగిందని ద్రవ్య జరిమానా విధించదగినదేనని భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది.ఆర్.బి.ఐ తీసుకున్న ఈ చర్య నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి ఉండటంలో లోపాల కారణంగా తీసుకున్నదే కానీ, బ్యాంకు తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే అభిప్రాయంగా మాత్రం పరిగణించరాదు. అంతేకాక, ఈ ద్రవ్య జరిమానా విధింపు బ్యాంకుపై ఆర్.బి.ఐ తీసుకునే మరే ఇతర చర్యలకు పక్షపాత ధోరణిగా ఉండదు. (పునీత్ పాంచోలి) చీఫ్ జనరల్ మేనేజర్ పత్రికా ప్రకటన : 2024-2025/476 |