యశ్వంత్ నగరి సహకారి బ్యాంక్ లి., లాటూర్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధింపు
మే 16, 2017 యశ్వంత్ నగరి సహకారి బ్యాంక్ లి., లాటూర్ (మహారాష్ట్ర) పై భారతీయ రిజర్వ్ బ్యాంక్ జరిమానా విధింపు భారతీయ రిజర్వ్ బ్యాంక్, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 (కో-ఆపరేటివ్ సొసైటీలకు వర్తించేమేరకు), సెక్షన్ 47 (A)(1)(b) మరియు సెక్షన్ 46(4) క్రింద తమకు దఖలుపరచబడిన అధికారాలతో, యశ్వంత్ నగరి సహకారి బ్యాంక్ లి., లాటూర్ పై, మీ వినియోగదారుణ్ణి తెలిసికోండి (KYC) నిబంధనలు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఉల్లంఘించినందుకు, 1.0 లక్ష రూపాయిలు (ఒక లక్ష రూపాయిలు) నగదు జరిమానా విధించినది. రిజర్వ్ బ్యాంక్ జారీ చేసిన షో కాజ్ నోటీసుకు, బ్యాంక్ లిఖిత పూర్వకంగా జవాబు ఇచ్చినది. ఈ విషయంలో నిజానిజాలు మరియు బ్యాంక్ సమర్పించిన జవాబు పరిశీలించిన తరువాత, ఈ ఉల్లంఘనలు నిరూపించబడినట్లు, అవి నగదు జరిమానా విధించవలసినవేనని, రిజర్వ్ బ్యాంక్ నిర్ధారణకు వచ్చింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2016-2017/3082 |
పేజీ చివరిగా అప్‌డేట్ చేయబడిన తేదీ: