<font face="mangal" size="3px">యూత్ డెవలప్‌మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిĶ - ఆర్బిఐ - Reserve Bank of India
యూత్ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కొల్హాపూర్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ద్రవ్య జరిమానా విధింపు
ఫిబ్రవరి 20, 2023 యూత్ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కొల్హాపూర్ పై భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) ఫిబ్రవరి 14, 2023 నాటి ఉత్తర్వు ద్వారా, ‘యూత్ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కొల్హాపూర్’ పై RBI విధించిన “అల్ ఇంక్లూజివ్ డైరెక్షన్” లను పాటించనందులకు/ఉల్లంఘించినందులకు, ₹1.00 లక్ష (ఒక లక్ష రూపాయలు మాత్రమే) ద్రవ్య జరిమానా విధించింది. RBI జారీ చేసిన పై ఆదేశాలను పాటించడంలో బ్యాంక్ వైఫల్యాన్ని పరిగణనలోకి తీసుకొంటూ, బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 56 తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని RBI ద్వారా ఈ జరిమానా విధింపబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2021 నాటి ఆర్థిక స్థితి ఆధారంతో తయారయిన బ్యాంక్ యొక్క రిస్క్ అసెస్మెంట్ రిపోర్టు ద్వారా, మిగతావాటితో కలిపి, RBI విధించిన “అల్ ఇంక్లూజివ్ డైరెక్షన్” లను అతిక్రమించి భారతీయ రిజర్వు బ్యాంకు ముందస్తు వ్రాతపూర్వక అనుమతి లేకుండా బ్యాంక్ రుణగ్రహీతలతో వన్ టైమ్ సెటిల్మెంట్ (OTS) కుదుర్చుకున్నట్లు వెల్లడి చేయబడింది. దీని ఆధారంగా, పైన ఉటంకించిన ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసు కు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరo, మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, బ్యాంక్ ద్వారా RBI ఆదేశాల ఉల్లంఘన జరిగిందని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాళ్) పత్రికా ప్రకటన: 2022-2023/1756 |