<font face="mangal" size="3">ది సికింద్రాబాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటĺ - ఆర్బిఐ - Reserve Bank of India
ది సికింద్రాబాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., హైదరాబాద్, తెలంగాణ ఫై ఆర్బిఐ జరిమానా విధించింది
June 08, 2018 ది సికింద్రాబాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., హైదరాబాద్, తెలంగాణ ఫై సికింద్రాబాద్ పట్టణ సహకార బ్యాంక్ లిమిటెడ్., హైదరాబాద్, తెలంగాణ పై, భారతీయ రిజర్వు బ్యాంకు ₹ 2,50,000/- (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానా విధించింది. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ (ATM) యొక్క సంస్థాపనపై / మార్గదర్శక సూత్రాలు, సవరించిన సూపర్వైజరీ యాక్షన్ ఫ్రేమ్వర్క్ (SAF), ఎక్స్పోజర్ నిబంధనలను, భారతీయ రిజర్వు బ్యాంకుకు తప్పు సమాచారం సమర్పించటం మరియు తనిఖీ సమయంలో సంబంధిత రికార్డులను సమర్పించకపోవటం వంటి సూచనలు/నిబంధనలు ఉల్లంఘించినందుకు, బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 సెక్షన్ 46 (2) మరియు (4) సెక్షన్ 47A (1) (ఎ) మరియు (సి) ప్రకారం ఫై జరిమానా విధించడం జరిగింది. భారతీయ రిజర్వు బ్యాంకు, బ్యాంకుకు జారీచేసిన షో- కాజ్ నోటీసుకు ప్రతిస్పందనగా బ్యాంక్ ఒక లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించింది. ఈ కేసులోని వాస్తవాలను, బ్యాంక్ ప్రత్యుత్తరం మరియు వ్యక్తిగత విచారణ లోని అంశాలను పరిశీలించిన తరువాత, ఈ విషయంపై, భారతీయ రిజర్వు బ్యాంకు మార్గదర్శకాలను పాటించడంలో బ్యాంకు ఉల్లంఘనలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చి జరిమానా విధించాలని నిర్ణయించడం జరిగింది. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2017-2018/3224 |